కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం తుంగలో తొక్కుతుందని సీఐటీయు జిల్లా కార్యదర్శి నెమ్మది వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఈరోజు సూర్యాపేటలో మాట్లాడారు. అక్టోబర్ మొదటి వారంలో జరిగే సీఐటీయు 4వ మహాసభలను కార్మికులు విజయవంతం చేయాలన్నారు. కేంద్రం అనుసరిస్తున్న విధానాలను ఎండగడతామన్నారు. బీడీ కార్మికులను కేంద్రం నిండా ముంచుతుందని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.