పలమనేరు: పట్టణ ఎస్సై లోకేష్ రెడ్డి తెలిపిన సమాచారం మేరకు. గురువారం కాల్వపల్లి వైయస్సార్ డ్యాం వద్ద కౌండిన్య నదిలో మగ శవం లభ్యమైన సంగతి విధితమే. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా, సదరు వ్యక్తి లారీ డ్రైవర్ దేవేంద్ర గా గుర్తించడం జరిగింది. ఇతనికి 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది, అనంతరం ముగ్గురు కుమార్తెలు జన్మించారు ఈ నేపథ్యంలో ఐదేళ్ల క్రితం పక్షవాతం రాగా భార్య పిల్లలు పట్టించుకోకపోవడంతో తన తల్లి వద్ద ఉంటున్నాడు. ఆ డిప్రెషన్ లోకి వెళ్లి కౌండిన్య నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు.