అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని కోట నేసే విధిలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రెండు ఇళ్లు కుప్పకూలాయి. వివరాలిలా ఉన్నాయి. గుత్తి పట్టణంలోని కోట నేసే విధిలో నివాసం ఉండే సయ్యద్ బాష విజయ్ ల ఇంటి పైకప్పులు భారీగా కురిసిన వర్షాలకు తడిచి ముద్దయ్యాయి. అయితే శుక్రవారం ఒక్కసారిగా ఇంటి పైకప్పులు నెలకూలడంతో వారు నిరాశ్రయులు అయ్యారు. పైకప్పు కూలిన చోట ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.