అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని ప్రసన్నాయిపల్లి వద్ద పల్లె ఉమా వ్యవసాయ క్షేత్రంలో శనివారం 11:40 నిమిషాల సమయంలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పల్లె ఉమా ఏడవ వర్ధంతి సందర్భంగా పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పల్లె సింధూర రెడ్డి పల్లె రఘునాథ్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ పల్లె ఉమా బాలాజీ విద్యాసంస్థలు ఏర్పాటు చేయడంలో వాటిని అభివృద్ధి చేయడంలో ఎనలేని కృషి చేయడం జరిగిందని అదేవిధంగా పేద విద్యార్థులకు ఫీజులు కూడా తగ్గించేదని ఇటువంటి వ్యక్తి మా మధ్య లేకపోవడం బాధాకరమని పల్లె రఘునాథ్ రెడ్డి సింధూర రెడ్డి పేర్కొన్నారు.