రాజన్న సిరిసిల్ల జిల్లా, బోయిన్పల్లి మండలం,శభాజ్ పల్లి గ్రామ శివారులో అదుపుతప్పి ఆటో బోల్తా పడిన ఘటన గురువారం 7:40 PM కి చోటుచేసుకుంది, వేములవాడ నుండి 5 గురు ప్యాసింజర్లతో కూడిన ఆటో కరీంనగర్ వెళ్తుండగా శభాజ్ పల్లి గ్రామ శివారు వద్దకు రాగానే, ఎదురుగా భారీ గ్రానైట్ లోడుతో వస్తున్న లారీ నుండి తప్పించే క్రమంలో ఎడమవైపు రోడ్డు దిగుతుండగా అకస్మాత్తుగా గుంతలో దిగబడి అదుపుతప్పి ఆటో బోల్తా పడింది,దీంతో 4గురికి తీవ్ర గాయాలు కాగా ఇద్దరు మహిళల పరిస్థితి విషమంగా మారింది,దీంతో గాయాలైన వారిని మరో వాహనంలో చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు,ఈ ఘటనకు చెందిన వివరాలు తెలియాల్సి ఉంది,