గంగవరం: మండల పోలీస్ వర్గాలు తెలిపిన సమాచారం మేరకు. బొమ్మనపల్లి గ్రామంలో మొగిలప్ప కుమారుడు బాలాజీ 45 తన వ్యవసాయ బావి వద్ద ఉరివేసుకున్న స్థితిలో మరణించి ఉన్నాడని సమాచారం మేరకు, ఘటన ప్రాంతానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీన పరుచుకుని పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు. బాలాజీ మృతికి భూతగాదాలు కారణమని ప్రాథమిక సమాచారం ఉంది, దర్యాప్తు చేసి మరింకేదైనా కారణాలు ఉన్నాయో వివరాలు వెల్లడిస్తామన్నారు పోలీసులు. కాగా మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు, బాలాజీ అర్ధాంతరంగా తనువు చాలించడంతో తమకు దిక్కెవరు దేవుడా అంటూ కన్నీటి పర్యంతమయ్యారు కుటుంబీకులు.