హైదరాబాద్లో శుక్రవారం రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి 156వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వైఎంసీఏ చౌరస్తాలోని ఆయన విగ్రహానికి నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీవీ ఆనంద్ మాట్లాడుతూ, నిజాం పాలనలో కొత్వాల్గా 14 ఏళ్లు సుదీర్ఘ సేవలు అందించిన రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి మహిళల విద్యకు పెద్దపీట వేస్తూ విద్యాసంస్థలను స్థాపించారని కొనియాడారు