గుంటూరు జిల్లా దుగ్గిరాల జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో విద్యార్థినుల కోసం ఆదివారం 1.60 లక్షల వ్యయంతో రన్నింగ్ వాటర్ సిస్టమ్ ఏర్పాటుకు రోటరీ క్లబ్ గుంటూరు జిల్లా గవర్నర్ డాక్టర్ ఎస్. వి. ప్రసాద్ శంకుస్థాపన చేశారు. మంచి కార్యక్రమాలకు రోటరీ క్లబ్ ఎల్లప్పుడూ ముందుంటుందని ఆయన అన్నారు. పాఠశాల హెచ్ఎం శోభారాణి రోటరీ క్లబ్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ పాఠశాలల్లో మౌలిక వసతులకు రోటరీ క్లబ్ కృషి చేస్తుందని తెలిపారు.