'మహిళల కోసమే స్త్రీ శక్తి పథకం ’ తంబళ్లపల్లె నియోజకవర్గంలో త్వరలో జరగబోయే స్త్రీ శక్తి బహిరంగ సభను జయప్రదం చేయాలని TDP ఇన్ఛార్జ్ జయచంద్రా రెడ్డి సతీమణి కల్పన రెడ్డి కోరారు. ఆదివారం ఉదయం 10 గంటలకు ములకలచెరువులోని టీడీపీ ఆఫీస్ లో మండల స్థాయి మహిళా నాయకులతో ఆమె "స్త్రీ శక్తి" సభ నిర్వహణఫై సమీక్షించారు. మహిళల సంక్షేమం, ఆర్థిక సాధికారత కోరే ప్రభుత్వం ఇదని చెప్పారు. సూపర్-6లో చాలా పథకాలు మహిళల కోసమే ప్రవేశ పెట్టిందని గుర్తు చేశారు. లాంటి పథకాలలో స్త్రీ శక్తి పథకం ఒకటని పేర్కొన్నారు...