రైతులకు సరిపడా యురియా అందించాలంటూ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆధ్వర్యంలో రైతులు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పాధమిక వ్యవసాయ సహకార సంఘం ఎదుట సోమవారం సాయంత్రం 4:00 లకు ధర్నా నిర్వహించారు. రైతులు అధికారులకు... ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.శంకర్ నాయక్ మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం మోసపురితమైన వాగ్దానాలతో అధికారం చేపట్టి రైతులకు రైతు బంధు, రైతు భీమా కనీసం రైతులకు యూరియా అందించలేక పోతుందని విమర్శించారు. రైతులకు సరిపడా యూరియా అందించకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.