కాలేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై కాంగ్రెస్ ప్రభుత్వం సిబిఐ విచారణ కోరడం స్పందిస్తున్నామని కేంద్రమంత్రి బండి సంజయ్ సోమవారం కరీంనగర్ ఎంపీ ఆఫీస్ నుంచి విడుదల చేసిన పత్రిక ప్రకటన ద్వారా తెలిపారు. బిజెపి మొదటినుంచి సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేశామని, కాలేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి కర్త కర్మ బిఆర్ఎస్ పార్టీ మాత్రమే అని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సత్యానికి తలవంచి ప్రాజెక్టు కేసును సిబిఐకి అప్పగించడం మంచిదైందని అన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు ఒక ఏటీఎం లాగా మారిందని బిజెపి ప్రధాని మోదీ తో పాటు, రాష్ట్రంలోని ప్రతి నాయకుడు ముందు నుంచే చెబుతున్నామని అన్నారు.