Download Now Banner

This browser does not support the video element.

సంగారెడ్డి: కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 29న నిర్వహించే ధర్నాను జయప్రదం చేయాలి : సిఐటియు జిల్లా అధ్యక్షులు మల్లేశం

Sangareddy, Sangareddy | Aug 27, 2025
కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 29న సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట నిర్వహించే ధర్నాను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు మల్లేశం పిలుపునిచ్చారు. సంగారెడ్డి పట్టణంలో సుందరయ్య భవనంలో ధర్నాకు సంబంధించిన కరపత్రాలను బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని ఈఎస్ఐ పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ధర్నాకు జిల్లాలోని కార్మికులు భారీ సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us