వైసీపీ అధినేత జగన్ అదేశాలతో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకస్తూ ఈ నెల 19న పార్టీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో తలపెట్టిన ' ఛలో మెడికల్ కాలేజీ' నిరసన కార్యక్రమం గోడ పత్రికను గురువారం వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీహరి గోపాలరావు ఆవిష్కరించారు. ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. మాజీ డీసీఎంఎస్ చైర్మన్ తాతాజీ పాల్గొన్నారు.