యూరియా సరఫరా చేయాలంటూ నర్సాపూర్ తూప్రాన్ ప్రధాన రోడ్డుపై రైతులు బైఠాయించి ఆదివారం ధర్నా రాస్తారోకో చేశారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత రెడ్డి రైతులకు సంఘీభావం తెలుపుతూ రోడ్డుపై బైఠాయించి యూరియా కోసం నివారించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వానికి ముందు చూపు కొరవడిందని రైతులు ఇబ్బందులు పడుతున్న పట్టించుకోకపోవడంపై మండిపడ్డారు. తక్షణమే రైతుల సమస్యలను పరిష్కరించి యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఫోన్లో కలెక్టర్ తో మాట్లాడి సోంపేట పిఎసిఎస్ కు యూరియా సరఫరా చేయాలని కోరారు. ధర్నాలో పాల్గొన్న రైతులకు వాటర్ బాటిల్ సరపర చేశారు.