గుంతకల్లు మండలంలోని నెలగొండ గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మండల మాజీ ఎంపీపీ నాగభూషణం మృతి చెందారు. కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతు శనివారం వేకువజామున మృతి చెందారు. మాజీ ఎంపీపీ మృతి చెందిన విషయం తెలుసుకున్న గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే , టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్.జితేంద్ర గౌడ్ మాజీ ఎంపీపీ నివాసానికి వెళ్లి భౌతిక దేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. మాజీ ఎంపీపీ మృతదేహాన్ని టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్ సందర్శించారు.