భీమ్గల్ మండల పరిషత్ కార్యాలయంలో MPDO సంతోష్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. మండలంలో అధిక వర్షపాతం మూలంగా ఇసుక మేటలు వేసిన భూములలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టవలసిన పనుల గురించి మండల అగ్రికల్చర్ అధికారి, ఉపాధి హామీ సిబ్బందితో సమీక్షించారు. ఈ సమీక్షలో మండలంలో 124 మంది రైతుల భూములలో సుమారు 85 ఎకరాలలో ఇసుక మేటలు వేసినట్టు అగ్రికల్చర్ అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఉపాధి హామీ పథకంలో వెంటనే అంచనాలు తయారుచేసి పనులు ప్రారంభించాలన్నారు.