కనిగిరి: పొదుపు మహిళలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కుట్టు శిక్షణ ద్వారా శిక్షణ పొంది ఆర్థికంగా అభివృద్ధి చెందాలని వెలుగు కమ్యూనిటీ కోఆర్డినేటర్ మహబూబ్ బాషా సూచించారు. కనిగిరి మండలంలోని పోలవరం గ్రామంలో సోమవారం పొదుపు మహిళలకు కుట్టు శిక్షణా కేంద్రాన్ని వెలుగు సిబ్బందితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... పొదుపు మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థల సహకారంతో, గ్రామీణ ప్రాంతాల్లో కుట్టు శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తుందన్నారు. వాటిని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.