Download Now Banner

This browser does not support the video element.

కామారెడ్డి: భారీ వర్షాల కారణంగా 44వ జాతీయ రహదారి వద్ద దారి మల్లింపు, అత్యవసరం ఉంటే 100కు డయల్ చేయాలని ఎస్పీ రాజేష్ చంద్ర వెల్లడి

Kamareddy, Kamareddy | Aug 28, 2025
కామారెడ్డి : జాతీయ రహదారి 44వ కామారెడ్డి వద్ద భారీ వర్షాల కారణంగా రోడ్లు దెబ్బతినడంతో, వర్షపు నీరు వరదల ప్రవహిస్తుండడంతో కేవలం 25% రాకపోకలు మాత్రమే సాధ్యమవుతున్నాయని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. గురువారం కురిసిన భారీ వర్షంలో గొడుగు పట్టుకొని పరిస్థితిని పర్యవేక్షించిన ఆయన, ప్రయాణికులను మేడ్చల్ - రామాయంపేట - కామారెడ్డి - డిచ్పల్లి మార్గానికి బదులుగా ప్రత్యామ్నాయ దారులను ఉపయోగించాల్సిందిగా కోరారు. అటువైపు వాహనదారులు వెళ్ళవద్దని సూచించారు. ప్రమాద సూచిక బోర్డులను కూడా ఏర్పాటు చేయించారు. ప్రతి చోటకి వెళ్లి ఎస్పి పరిస్థితిలన్నింటినీ ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us