నిజామాబాద్ పట్టణంలో వినాయక శోభాయాత్ర రూట్ మ్యాప్ ను ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యుత్ అధికారులు మున్సిపల్ అధికారులు పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే విద్యుత్ అధికారులను అప్రమత్తంగా ఉండాలని వినాయక ఉత్సవ ఊరేగింపులో అప్రమత్తంగా ఉండి విద్యుత్ తీగలను ఉత్సవ విగ్రహాలకు తగలకుండా చూడాలన్నారు.