దరివంపు వాగును పరిశీలించిన ఆదోని సబ్ కలెక్టర్ ఎమ్మిగనూరు నియోజకవర్గం పరిధిలోని గోనెగండ్ల, నందవరం మండలం నాగలదిన్నె రోడ్డులో ముంపునకు గురైన దరివంకను ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, స్థానిక ఎమ్మార్వో రమాదేవి పరిశీలించారు. చిక్కుకున్న ఆర్టీసీ బస్సును జేసీబీ సహాయంతో బయటకు లాగారు. వర్షాలకు సంబంధించిన ప్రమాదాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులు వంకలు దాటేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆస్ఐ జనార్దన్ స్వామి, వీఆర్వో భీమన్న గౌడ్ పాల్గొన్నారు.