తంబళ్లపల్లి 108 కు కాలం చెల్లిందని గ్రామస్తుల ఆవేదన తంబళ్లపల్లె CHCకి చెందిన 108 వాహనం ఎప్పుడు, ఎక్కడ ఆగిపోతుందో తెలియని పరిస్థితి. శుక్రవారం కడుపునొప్పితో బాధపడుతున్న వ్యక్తిని బండ్రేవు నుంచి తంబళ్లపల్లె ఆసుపత్రికి తరలిస్తుండగా బోయపల్లె వద్ద 108 వాహనం ఆగిపోయింది. దీంతో రోగి ఆటోలో ఆసుపత్రికి వచ్చాడు. గత 2 నెలల వ్యవధిలో పలుమార్లు వాహనం మొరాయించడంతో రోగులు కష్టాలు పడ్డారు. కాలం చెల్లిన వాహనాలను మార్చాలని ప్రజలు కోరుతున్నారు.