భార్యపై కొడవలితో దాడి భార్యపై కొడవలితోదాడి చేసిన ఘటనపై దమ్మపేట పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు పోలీసుల కథనం ప్రకారం వాడే మునీశ్వరి తన భర్తతో విభేదించి వేరుగా ఉంటుంది•తన పిల్లలను చూడడానికి గండుగులపల్లిలోని ఏకలవ్య పాఠశాలకు బుధవారం వచ్చింది•ఆమె భర్త బుజ్జి బాబు అకస్మాత్తుగా ఆమెపై కొడవలితో దాడి చేశాడు•దీంతో ఆమె మెడ భాగం లో తీవ్ర గాయమై రక్తస్రావం ఏర్పడింది•బాధితురాలు సోదరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.