హంద్రీ నీవా జలాలతో సీఎం చంద్రబాబు నాయుడు రాయలసీమను సస్యశ్యామలం చేయడమే ధ్యేయంగా పని చేస్తున్నారని కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్, తెలుగుదేశం పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడుయాదవ్ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లు మండలంలోని కసాపురం గ్రామంలోని హంద్రీ నీవా కాలువ వద్ద శనివారం గంగపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడుయాదవ్ మాట్లాడుతూ దశాబ్దాలుగా కరువు బారిన పడిన రాయలసీమకు ఇచ్చిన హామీ ప్రకారం హంద్రీ నీవా కాలువ నుంచి చివరన కుప్పం వరకు నీరు అందిస్తామని పేర్కొన్న హామీని సీఎం చంద్రబాబు నెరవేర్చారన్నారు.