గుంటూరు జిల్లా కొల్లిపర మండలం అత్తోటలో మంగళవారం దారుణం జరిగింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న బొల్లిముంత బుల్లెమ్మ అనే మహిళపై దుండగులు దాడి చేసి బంగారు ఆభరణాలు అపహరించారు. మహిళ ప్రతిఘటించడంతో తలపై దాడి చేసిన ఇద్దరు దుండగులు 16 సవర్ల 8 బంగారు చేతి గాజులు లాక్కుని పరారయ్యారు. దాడిలో మహిళ తీవ్రంగా గాయపడగా తెనాలిలోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కొల్లిపర పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.