సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని కోహెడ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు గురువారం రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. కోహెడ మండలంలోని నారాయణపూర్ గ్రామంలో గొట్లమిట్ట నుండి నారాయణపూర్ వెళ్ళే రోడ్డులో 91.55 లక్షల రూపాయల వ్యయంతో హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. చాలా కాలంగా బ్రిడ్జి నిర్మాణానికి ఎదురు చూస్తున్న గ్రామస్థులకు బ్రిడ్జి శంకుస్థాపన చేసుకోవడం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. పనులు వేగంగా చేసి బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అలాగే కాచాపూర్ గ్రామంల