అనంతపురం జిల్లా కేంద్రంలో శనివారం మధ్యాహ్నం 3 గంటల 45 నిమిషాల సమయంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత క్యాంపు కార్యాలయంలో రాప్తాడు నియోజకవర్గం 16 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పరిటాల సునీత మాట్లాడుతూ రాప్తాడు అనంతపురం రూరల్ ఆత్మకూరు మండలాలకు చెందిన 16 మందికి 10 లక్షల 72,500 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగిందని భవిష్యత్తులో సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకున్న వారందరికీ తమ వంతు సహకారం అందజేస్తామని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అనంతపురం రూరల్ టిడిపి నేతలు పాల్గొన్నారు.