ఆత్మకూర్ (ఎస్) మండలం ఏపూర్ గ్రామం ఐకేపీ సెంటర్లో తడిసి మొలకేత్తిన వడ్లను మాజీమంత్రి, స్థానిక ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పరిశీలించారు.ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్రం ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. రైతులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి 60 రోజులు గడుస్తున్నా.. వడ్లు కొనలేదంటే ఇంతకన్నా దారుణం ఉంటుందా అని ఆరోపించారు.