లింగ నిర్ధారణ పరీక్షలు చేసే స్కానింగ్ సెంటర్ నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కృష్ణాజిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిణి డా. జి గీతాబాయి హెచ్చరించారు. గీతాబాయి అధ్యక్షతన బుధవారం సాయంత్రం 4గంటల సమయంలో DMHO కార్యాలయంలో PCPNDT చట్టంపై జిల్లా స్థాయి సలహా సంఘ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డా. గీతాబాయి మాట్లాడుతూ జిల్లాలోని అన్ని స్కానింగ్ కేంద్రాలలో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించుట చట్టరీత్యా నేరమన్నారు.