అనంతపురం జిల్లా గుత్తి మండలంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం అర్ధరాత్రి నుంచి ప్రారంభమైన వర్షం గురువారం ఉదయం వరకు కురుస్తూనే ఉన్నాయి. ఎగువన ఉన్న నంద్యాల, కర్నూలు జిల్లాలలో భారీగా కురిసిన వర్షాలకు దిగువన గుత్తిలో ఉన్న పెద్ద వంక, ఉప్పు వంక, కాలువలు నిండుగా ప్రవహిస్తున్నాయి. పైన కురిసిన వర్షాలకు గుత్తి చెరువులోనికి భారీగా నీళ్లు చేరుతున్నాయి. కొన్ని గ్రామాల్లో వర్షం నీళ్ళు పంట పొలాల్లోకి చేరాయి.