రద్దు చేసిన వికలాంగుల పింఛన్లను ఎలాంటి మినహాయింపులు లేకుండా పునరుద్ధరించాలని బాపట్ల వైసిపి మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి సోమవారం మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు.కళ్ళెదుట అంగవైకల్యం స్పష్టంగా కనిపిస్తున్నా పాలకులు ఏమాత్రం కనికరం లేకుండా వారి పింఛన్లు రద్దు చేశారని ఆయన విమర్శించారు.చంద్రబాబు ప్రభుత్వం చెప్పేది ఒకటి,చేసేది ఒకటని ఆయన ధ్వజమెత్తారు.తదుపరి జిల్లా కలెక్టర్ కి రఘుపతి వినతి పత్రం సమర్పించారు.