ప్రమాదవశాత్తు ఆటో బోల్తా పడి ఇద్దరికీ తీవ్ర గాయాలైన సంఘటన సంగారెడ్డి జిల్లా దౌల్తాబాద్ సంగారెడ్డి రోడ్డుపై సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిప్పల్ పూర్తి గ్రామానికి చెందిన కురుమ శ్రీనివాస్ నల్గొండ నవీన్లు సంగారెడ్డి వైపు వెళుతుండగా దౌల్తాబాద్ కింగ్ దాబా ఎదుట ప్రమాదవశాత్తు బోల్తా పడి ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి 108కు ఫోన్ చేయగా ప్రమాద స్థలానికి చేరుకొని ప్రథమ చికిత్స చేశారు. గాయపడిన వారి స్నేహితులు వారిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.