నల్గొండ జిల్లా, కనగల్ మండలం, బొమ్మపల్లి వాగు నుండి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 2 ట్రాక్టర్లను కనగల్ పోలీసులు పట్టుకున్నారు. ఆదివారం రాత్రి కనగల్ ఎస్సై రాజీవ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. బొమ్మపల్లి వాగు నుండి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 2 ట్రాక్టర్లను పట్టుకున్నట్లు తెలిపారు. కానిస్టేబుల్ నరేష్, బాలరాజు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న 2 ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు తెలిపారు. 2 ట్రాక్టర్లను సీజ్ చేసి డ్రైవర్లు తాటికొండ యాదయ్య,తాటికొండ నాగరాజు పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు