బి కొత్తకోట హెల్త్ సెంటర్లో ఆకతాయిల బీభక్షం బి కొత్తకోటలో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. మహిళా ఉద్యోగులు పనిచేసే హెల్త్ సెంటర్లో అర్థరాత్రి కిటికీలు ధ్వంసం చేసి రాళ్లు కిటికీ పిల్లలు పగలగొట్టి నానా బీభక్షం సృష్టించడం మంగళవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై సిహెచ్ఓ స్వాతి స్థానిక పోలీసులకు ఆకతాయిల ఆగడాలు, హెల్త్ సెంటర్లో ధ్వంసమైన పరికరాల నష్టం పై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. బి కొత్తకోట పోలీసులు ఘటనపై స్పందిస్తారో లేదో వేచి చూడాల్సి ఉంది