ఆగస్టు 2వ తేదీన అన్నదాత సుఖీభవ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దర్శి నియోజకవర్గ వీరాయపాలెం గ్రామానికి వస్తున్న నేపథ్యంలో ప్రకాశం జిల్లా మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి వరుసగా రెండో రోజైన గురువారం కూడా ఆ గ్రామానికి వెళ్లి సీఎం టూర్ ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం వచ్చే హెలికాప్టర్ దిగే దిగేందుకు అనువైన ప్రదేశాన్ని ఎంపిక చేసి అక్కడ తెలుగు హెలిప్యాడ్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం కొందరు రైతుల పొలాలను సందర్శించే అవకాశం ఉండడంతో వాటి ఎంపికను కూడా మంత్రి చేపట్టారు