ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం లోని ఆగిరిపల్లి మండలం శోభనాపురం లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి నూజివీడు సబ్ కలెక్టర్ వినూత్న శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో పాల్గొని రోడ్లను శుభ్రం చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ప్లాస్టిక్ నివారించాలని చెట్లు పెంచాలని కోరారు