సమస్యలు పరిష్కరించడంలో అలసత్వం వద్దు: సబ్ కలెక్టర్ ప్రజల సమస్యలు పరిష్కరించడం లో అలసత్వం వద్దని మదనపల్లె సబ్ కలెక్టర్ కళ్యాణి అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం స్థానిక సబ్ కలెక్టరేట్ లో ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 2.30 వరకు జరిగింది. డివిజన్లోని గ్రామాల నుంచి 75 అర్జీలను ప్రజలు సబ్ కలెక్టర్ కు అందజేసి, సమస్య పరిష్కరించాలని విన్నవించారు. స్పందించిన సబ్ కలెక్టర్ వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి.. ప్రజల సమస్యలు అలసత్వం లేకుండా పరిష్కరించాలని ఆదేశించారు.