సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో శనివారం మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. ముందుగా హుస్నాబాద్ పట్టణంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారిని మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ఈవో కిషన్ రావు ,ఇతర అధికారులతో కలిసి ఆలయ ఆవరణలో పెండింగ్ పనుల పురోగతిపై అడిగి తెలుసుకున్నారు. అమ్మవారి ఆలయం వద్దకు వచ్చే భక్తులకు ఇలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని దేవాలయ అధికారులను ఆదేశించారు. అనంతరం హుస్నాబాద్ పట్టణంలోని ఎల్లమ్మ చెరువు సుందరీకరణ అభివృద్ధి పనులను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. సుందరీకరణ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.