చీరాల తెల్ల గాంధీ బొమ్మ సెంటర్లో శనివారం కూర్మాల శ్రీనివాసరావు అనే వ్యక్తి పై దాడి జరిగింది.కుటుంబ కలహాల నేపథ్యంలో గుంటూరు మాధవరావు తనపై రాడ్ తో దాడి చేశాడంటూ శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ దాడిలో శ్రీనివాసరావు తల పగలగా 20 కుట్లు పడ్డాయి.చీరాల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు అతడిని గుంటూరుకు రెఫర్ చేశారు.కాగా శ్రీనివాసరావే తనపై దాడి చేశాడని, ఈ క్రమంలో అతను రోడ్డుపై పడగా తల పగిలిందని మాధవరావు చెప్పారు.పూర్తి వివరాలు అందాల్సి ఉంది.