మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని అతని అవినీతిని తాను బట్టబయలు చేస్తే నియోజకవర్గంలో లక్ష్మారెడ్డి తలెత్తుకోకుండా పోతాడని వచ్చే ఎన్నికల్లో పోటీ కూడా చేయడని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మండి పడ్డారు. శుక్రవారం మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం కేంద్రంలో లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు మరియు షాది ముబారక్ ,కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతోందని నియోజకవర్గస్థాయిలో ప్రస్తుతం 4,686 కొత్త రేషన్ కార్డులు మంజూరు అయ్యాయని అన్నారు.