ఎల్లారెడ్డి : ఈనెల 4 వ తేదీ గురువారం నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్న కామారెడ్డి జిల్లాలోని వివిధ ప్రాంతాలను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్రతో కలిసి పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. బుధవారం తాడ్వాయి మండలం ఎర్ర పహాడ్ వద్ద ముఖ్యమంత్రి హెలిక్యాప్టర్ దిగేందుకు ఏర్పాటుచేసిన హెలిపాడ్ ను పరిశీలించి ఇన్చార్జిలుగా చూసుకోవాలని ఆర్డీవో కామారెడ్డి మరియ తహసిల్దార్ తాడ్వాయి లకు సూచించారు. ముఖ్యమంత్రి కార్యక్రమం సాఫీగా జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు.