11 సంవత్సరాల వయస్సు గల, సరిగ్గా మాట్లాడలేని మైనర్ బాలికపై, 16 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు అబ్బాయిలు అత్యాచారం చేశారు అనే ఆరోపణపై విశాఖపట్నం సిటీ పోలీస్ పరిదిలో గల ద్వారకా నగర్ పోలీస్ స్టేషన్ నందు క్రైమ్ నెంబర్140/2025 u/s 70(2) BNS, sec 5(g), 5(m) r/w 6 POCSO చట్టం 2012 క్రింద కేసు నమోదు చేయబడింది. నేరస్తులు ఇద్దరుగా గుర్తించి వారిని వెంటనే అరెస్ట్ చేయడం జరిగింది. వారు రిమాండ్ కి కూడా తరలించామని పోలీస్ కమిషనర్ సోమవారం పత్రిక ప్రకటన ద్వారా తెలిపారు