సంగారెడ్డిలోని ది గ్రేస్ వృద్ధాశ్రమంలో గురువారం వృద్ధుల దినోత్సవం నిర్వహించారు. న్యాయ సేవ అధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి సౌజన్య ది గ్రేస్ వృద్ధాశ్రమం ను ఆకస్మికంగా తనిఖీ చేసి వృద్ధులతో మాట్లాడారు. సమాజంలో వృద్ధులను గౌరవించాలని వారి బాగోగులు చూడాలని పేర్కొన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. ఏదైనా న్యాయ సాయం కావాలంటే ఉచితంగా అందజేయనున్నట్లు న్యాయ సహాయం కోసం సంగారెడ్డి ఆఫీసులో సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వృద్ధాశ్రమ ఆఫీసర్లు వృద్ధులు పాల్గొన్నారు.