కోట్లాది రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి అర్థించి పెడుతున్న పోర్టులను ప్రైవేటుపరం చేయడం ఎంతవరకు సమంజసమని యునైటెడ్ పోర్టు డాక్ ఎంప్లాయిస్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు వి ఎస్ పద్మనాభరాజు అన్నారు. ఆదివారం విశాఖపట్నం డబల్ గార్డెన్స్ అల్లూరి విజ్ఞాన కేంద్రం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. చాలీచాలని వేతనాలతో కాంట్రాక్ట్ కార్మికులు తమ జీవనోపాధి సాగిస్తున్నారని ఏది ఏమైనా పోర్టులను ప్రైవేటుపరం చేస్తే ఊరుకునేది లేదని తమ నిరసన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని తెలిపారు