కడప నగరం ఒకటో డివిజన్ పాత కడప హరిజనవాడలో చిన్న చిన్న కాలువలన్నీ కలిపి వెళ్ళే ప్రధాన డ్రైనేజీ కాలువను తక్షణమే ఏర్పాటు చేయాలని సిపిఎం కడప నగర కార్యదర్శి రామమోహన్ డిమాండ్ చేశారు. మంగళవారం నాడు కడప నగరంలోని పాత కడప హరిజనవాడలో సిపిఎం పార్టీ నేతలు, ప్రజా సంఘాల నాయకులు కలిసి ఆ ప్రాంతంలో పర్యటన నిర్వహించారు.