కనిగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ఎక్కడా కూడా ఎరువుల కొరత అనేది లేదని కనిగిరి వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు జైనులాబ్దిన్ తెలిపారు. బుధవారం కనిగిరిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రస్తుతం 173 మెట్లు టన్నుల యూరియా రైతులకు అందుబాటులో ఉందన్నారు. ప్రతిరోజు యూరియా నిలవలపై తనిఖీలు చేస్తున్నామని, ఎంత యూరియా విక్రయిస్తున్నారు, ఎంత మేర నిల్వలు ఉన్నాయి అనే వివరాలు పరిశీలిస్తున్నామన్నారు. యూరియా కొరత అంటూ కొందరు చేస్తున్న దుష్ప్రచారాన్ని రైతులు నమ్మవద్దని, సరిపడినంత యూరియా అందుబాటులో ఉందని జైనులబ్దిన్ తెలిపారు.