కరీంనగర్ బైపాస్ రోడ్డు చేపల ఉత్పత్తి కేంద్రం సమీపంలో ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బుధవారం మధ్యాహ్నం బైపాస్ రోడ్డు వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగ స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పెద్దపల్లి జిల్లాకు చెందిన యువతి కరీంనగర్ జిల్లాలోని ఇంజనీరింగ్ కళాశాలలో రెండవ సంవత్సరం చదువుతుంది.ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.