సిద్దిపేట మున్సిపాలిటీలోని పలు అభివృద్ధి కార్యక్రమాలను శనివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు నగరపాలక కమిషనర్ మరియు అధికారులు పరిశీలించారు. ఈ మేరకు సిద్దిపేట పట్టణంలోని స్వచ్ఛ బడి, బుస్సాపూర్ రిసోర్స్ పార్క్,స్లాటర్ హౌజ్,సమీకృత మార్కెట్ లను సందర్శించారు. సిద్దిపేట పట్టణంలో ఇంటింటా వెలువడే తడి చెత్త ద్వారా తయారవుతున్నటువంటి సేంద్రియ ఎరువును తయారీ విధానాన్ని సేంద్రియ ఎరువు తయారీ కేంద్రంలో పరిశీలించడం జరిగింది. స్వచ్చ బడిపై ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణతోపాటు ఆరోగ్య సమాజ నిర్మాణం కోసం అన్ని హంగులతో నిర్మించిన స్వచ్ఛ బడిని అధికారులు సందర్శించారు. బడి నిర్మాణంలో వ్యర్థాలతో రూపొం