రీజినల్ రింగ్ రోడ్ లో భూములు కోల్పోతున్న రైతులను ఆదుకొని న్యాయం చేయాలని కోరుతూ సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కాసాల గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాసాల గ్రామస్తులు మాట్లాడుతూ గతంలో కాలేశ్వరం ప్రాజెక్టు కింద చత్తిస్గడ్ విద్యుత్ లైన్ కింద భూములు కోల్పోయామని ప్రస్తుతం రీజనల్ రింగ్ రోడ్ లో భూములు కోల్పోతున్నామని న్యాయం చేయాలని కలెక్టర్ కోరారు. భూమికి బదులు భూమి ఇవ్వాలని లేదా మార్కెట్ వాల్యూ ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీకేఎస్ సంఘం నాయకులు రైతులు పాల్గొన్నారు.