సత్య సాయి జిల్లా కనగానపల్లి మండలం తగరకుంట గ్రామంలో శనివారం ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు మీ సమస్య మా బాధ్యత కార్యక్రమాన్ని నిర్వహించి వివిధ శాఖ అధికారులు టిడిపి నేతలు ప్రజల నుంచి అర్జీలను తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా రాప్తాడు మార్కెట్ యార్డ్ చైర్మన్ సుధాకర్ మాట్లాడుతూ రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఆదేశాల మేరకు గ్రామాల్లో ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు మీ సమస్య మా బాధ్యత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తగరకుంటలో సమస్యలు ఉన్న ప్రజల నుంచి అర్జీ రూపంలో తీసుకొని వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని రాప్తాడు మార్కెట్ యార్డ్ చైర్మన్ బోయపాటి సుధాకర్ పేర్కొన్నారు.