జగిత్యాల జిల్లా వేములవాడ నియోజకవర్గం పరిధిలోని భీమారం మండలం గోవిందారం జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలకు చెందిన బత్తుల రుచిత రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైంది. జిల్లా స్థాయి పోటీలలో అత్యుత్తమ ప్రదర్శన చేసి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు అథ్లెటిక్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యం రెడ్డి శుక్రవారం తెలిపారు. విద్యార్థి రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక కావడంతో మండల వ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు